పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా రూ.8 లక్షల రిటర్న్స్ పొందే ఛాన్స్!

ప్రస్తుత కాలంలో ఏదైనా స్కీమ్ లో డబ్బులు డిపాజిట్ చేయాలంటే కూడా టెన్షన్ పడాల్సిన పరిస్థితి నెలకొంది. పోస్టాఫీస్ స్కీమ్స్ లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటిగా ఉంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను మోదీ సర్కార్ సవరించిన నేపథ్యంలో పోస్టాఫీస్ ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఈ స్కీమ్స్ పై ఏకంగా 6.5 శాతం వడ్డీ రేటు అమలవుతోందని సమాచారం.

ఎలాంటి రిస్క్ లేకుండా భవిష్యత్తులో భారీ స్థాయిలో రిటర్న్స్ పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్స్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ కాగా నెలకు 100 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు. మొదట ఐదేళ్లకు డిపాజిట్ చేసే ఛాన్స్ ఉండగా తర్వాత అవసరమైతే మరింత ఎక్కువ మొత్తం డిపాజిట్ చేయవచ్చు.

ప్రస్తుతం ఈ స్కీమ్స్ పై 6.5 శాతం వడ్డీ అమలవుతుండటం గమనార్హం. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లలొ మార్పులు చోటు చేసుకుంటాయి. నెలకు 5,000 రూపాయల చొప్పున పదేళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే రూ.8.46 లక్షలు పొందవచ్చు. 6 లక్షల రూపాయలు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే రెండున్నర లక్షల రూపాయల వడ్డీ లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

వడ్డీ రేట్లు పెరిగితే మరింత ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసిన మూడేళ్ల తర్వాత అవసరం అనుకుంటే అకౌంట్ ను క్లోజ్ చేయవచ్చు. వేర్వేరు పేర్లతో పోస్టాఫీస్ స్కీమ్స్ అమలవుతూ ఉండటం గమనార్హం. పేద ప్రజల నుంచి మధ్యతరగతి వర్గాల వరకు అన్ని వర్గాల ప్రజలకు ఈ స్కీమ్స్ ద్వారా బెనిఫిట్ కలుగుతుంది.