పోస్టాఫీస్ స్కీమ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. బ్యాంకులతో పోల్చి చూస్తే పోస్టాఫీస్ స్కీమ్స్ పెట్టుబడులు పెట్టడానికి సురక్షితమని చెప్పవచ్చు. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ దీర్ఘకాలంలో మంచి రాబడిని అందించే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ఏకంగా 7.5 శాతం వడ్డీ లభిస్తుంది.
గరిష్టంగా 5 సంవత్సరాల కాల వ్యవధి వరకు ఈ స్కీమ్ లో డబ్బులను డిపాజిట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. కేవలం ఏడాది పెట్టుబడి పెడితే 6.9 శాతం వడ్డీ లభించే ఛాన్స్ ఉంటుంది. 5 సంవత్సరాల సమయానికి 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే రూ. 2,24,974 వడ్డీని పొందే అవకాశం అయితే ఉంటుంది. 5 ఏళ్లు పెట్టుబడి పెడితే ఏకంగా రూ. 7,24,974 పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా సులువుగా లక్షల రూపాయలు పొందవచ్చు.
బ్యాంకులు అందిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ తో పోల్చి చూస్తే పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ బెస్ట్ స్కీమ్స్ అవుతాయని చెప్పవచ్చు. హామీతో కూడిన రాబడిని అందించే ఈ స్కీమ్స్ నష్ట భయం లేకుండా లాభాలను అందించే అవకాశం అయితే ఉంటుంది. మన దేశానికి చెందిన వాళ్లు ఈ స్కీమ్ లో సులభంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. కనీసం 1000 రూపాయలతో అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు.
గరిష్ట డిపాజిట్ పై పరిమితులు లేకపోవడంతో ఎంతైనా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. కాల వ్యవధిని పొడిగించుకునే అవకాశం ఉండటంతో ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది. మూడు నెలలకు ఒకసారి ఈ స్కీమ్స్ కు వడ్డీని లెక్క పెట్టడం జరుగుతుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ఆదాయపు పన్ను మినహాయింపులు లభించే అవకాశం ఉంటుంది.