నెలకు రూ.12 వేలు డిపాజిట్ చేస్తే రూ.కోటి ఆదాయం.. ఎలా పొందవచ్చంటే?

మనలో చాలామంది సులువుగా కోట్ల రూపాయల ఆదాయం సొంతం చేసుకోవాలని భావిస్తుంటారు. పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో ఆదాయం సొంతమవుతుంది. నెలకు కేవలం 12,000 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా సులువుగా కోటీశ్వరులు అయ్యే అవకాశం అయితే ఉంది. పీపీఎఫ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సులువుగా ఎక్కువ మొత్తం సంపాదించవచ్చు.

నెలకు 12,500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా కోటి రూపాయల వరకు ఆదాయం సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. దీర్ఘకాలంలో మంచి బెనిఫిట్స్ పొందాలని భావించే అమ్మాయిలకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుండగా ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ రేటులో స్వల్పంగా మార్పులు అయితే ఉంటాయని తెలుస్తోంది.

కేవలం 500 రూపాయలతో పోస్టాఫీస్ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ గడువు 15 సంవత్సరాలు కావడం గమనార్హం. గడువు పూర్తైన తర్వాత మరో ఐదేళ్ల పాటు గడువును పెంచుకోవచ్చు. 25 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ లో నెలకు 12,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే సులువుగా కోటి రూపాయలు మీ సొంతమవుతాయి. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులను పన్ను మినహాయింపు బెనిఫిట్స్ లభిస్తాయి.

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ప్రభుత్వం నుంచి హామీ ఉంటుంది కాబట్టి నష్టపోయే అవకాశం ఉండదు. దీర్ఘకాలంలో మంచి రాబడి పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుందని చెప్పవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఉద్యోగులకు, వ్యాపారులకు బెస్ట్ స్కీమ్ అవుతుందని చెప్పవచ్చు.