మనలో చాలామంది పోస్టాఫీస్ స్కీమ్స్ గురించి అవగాహన కలిగి ఉంటారు. స్థిరమైన రాబడి కావాలని కోరుకునే వాళ్లకు పోస్టాఫీస్ స్కీమ్స్ బెస్ట్ స్కీమ్స్ అని చెప్పవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ ఒకటి కాగా ఈ స్కీమ్ ద్వారా అవసరాలకు అనుగుణంగా డబ్బులను ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఐదేళ్ల మెచ్యూరిటీ కాలంతో ఈ స్కీమ్ అమలవుతోంది.
ఈ స్కీమ్ లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత 1,40,300 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. పదేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. గరిష్ట పరిమితి లేకపోవడంతో 1000 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ పై వచ్చే వడ్డీని మెచ్యూరిటీ సమయంలోనే పొందవచ్చు.
5 లక్షల రూపాయలు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసిన వాళ్లు వడ్డీతో కలిపి ఏకంగా 7 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఎలాంటి రిస్క్ లేకుండా రాబడి పొందే అవకాశం ఉండటంతో సీనియర్ సిటిజన్లకు ఈ స్కీమ్ ఎంతగానో ప్రయోజనం చేకూర్చుతుంది.
5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్లు సులువుగా 2 లక్షల రూపాయలు పొందే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు, సీనియర్ సిటిజన్లు ఈ స్కీమ్స్ పై దృష్టి పెడితే మంచిది. ఈ స్కీమ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేవాళ్లు పూర్తిస్థాయిలో అవగాహనను తెచ్చుకుని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు.