ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలలో కొన్నిసార్లు గాయాల పాలైతే మరి కొన్నిసార్లు మాత్రం ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. అయితే పోస్ట్ ఆఫీస్ లో అమలులో ఉన్న కొన్ని ప్రమాద బీమాలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ప్రమాద బీమాలు తీసుకుంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది.
పోస్టాఫీస్ నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ తో కలిసి బీమా అందిస్తుండగా ఏడాదికి 755 రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ తీసుకున వాళ్లు ప్రమాదంలో మృతి చెందితే నామినీ 15 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. వైద్య ఖర్చుల కోసం మరో లక్ష రూపాయలు అందజేయడం జరుగుతుంది. ఆస్పత్రిలో సాధారణ వైద్యం పొందితే రోజుకు 1000 రూపాయలు, ఐసీయూలో ఉంటే 2,000 రూపాయలు పొందవచ్చు.
చెయ్యి, కాలు విరిగిపోతే 25 వేల రూపాయలు పొందే ఛాన్స్ ఉంటుంది. పాలసీదారు చనిపోతే పిల్లల విద్యా ప్రయోజనాలకు లక్ష రూపాయలు, పిల్లల పెళ్లికి లక్ష రూపాయలు అందుతుంది. పోస్ట్ ఆఫీస్ టాటా ఐఐజీతో కలిసి ఒక పాలసీని అందిస్తుండగా 520 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ బీమా తీసుకుంటే ప్రమాదంలో మృతి చెందితే 10 లక్షల రూపాయలు, శాశ్వత వైకల్యం లేదా శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడినా 10 లక్షల రూపాయలు అందుతాయి.
ఆస్పత్రిలో చేరితే వైద్య ఖర్చులకు రూ.లక్ష, పిల్లల విద్యా ప్రయోజనాలకు రూ.లక్ష పొందవచ్చు. ఈ పాలసీలతో పాటు 320 రూపాయల ప్రీమియంతో మరో పాలసీ కూడా ఉంది. 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీలను తీసుకునే అవకాశం అయితే ఉంటుంది.