పదో తరగతి అర్హతతో పోస్టాఫీస్ లో భారీగా ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

భారత పోస్టల్ శాఖ నిరుద్యోగులకు ఎప్పటికప్పుడు అదిరిపోయే శుభవార్తలను చెబుతున్న సంగతి తెలిసిందే. 5 స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం భారత పోస్టల్ శాఖ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 2024 సంవత్సరం మార్చి నెల 19వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఆఫ్ లైన్ లేదా పోస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2024 సంవత్సరం మార్చి 19వ తేదీ నాటికి 56 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రిజర్వేషన్లకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపులు ఉండనున్నాయి.

స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 20,200 రూపాయల వరకు వేతనం లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులు లడఖ్, రాజౌరి, బారాముల్లా, ఉధంపూర్‌ ప్రాంతాలలో పోస్ట్ చేయబడతారని సమాచారం అందుతోంది. రాత పరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.

అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్ (రిక్రూట్‌మెంట్), జమ్మూ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలగనుంది.