కేంద్రం సూపర్ స్కీమ్.. రోజుకు రూ.30 పొదుపుతో రూ.5 లక్షలు పొందే ఛాన్స్?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. రోజుకు కేవలం 30 రూపాయల పొదుపు చేస్తూ ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 5 లక్షల రూపాయలు అయితే పొందవచ్చు. ఈ స్కీమ్ సూపర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎలాంటి రిస్క్ లేకుండా ఏకంగా 5 లక్షల రూపాయల రాబడి ఈ స్కీమ్ ద్వారా పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్ లో ఒకటని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. 15 సంవత్సరాల మెచ్యూరిటీ సమయంతో అమలవుతున్న ఈ స్కీమ్ పై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 7.1 శాతం వడ్డీ రేటును అమలు చేస్తోంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ట్యాక్స్ బెనిఫిట్ ను కూడా పొందే అవకాశం ఉంటుంది.

ఏడాదికి 12,000 రూపాయలు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 5 లక్షలు పొందవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అందించే ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎక్కువ మొత్తం బెనిఫిట్ పొందాలని భావించే వాళ్లు ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సమీపంలోని పోస్టాఫీస్ ద్వారా ఈ స్కీమ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ద్వారా ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయని చెప్పవచ్చు. సంపాదించే ఆదాయానికి అనుగుణంగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు సొంతమవుతాయని చెప్పవచ్చు.