పీపీఎఫ్ స్కీమ్ గురించి మీకు తెలుసా.. ఏకంగా 40 లక్షలు పొందే అవకాశం?

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్స్ లో పీపీఎఫ్ స్కీమ్ కూడా ఒకటి. రిస్క్ లేకుండా కచ్చితమైన రాబడి పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను పొందడంతో పాటు అవసరమైతే లోన్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అవసరం అనుకుంటే మధ్యలోనే ఖాతాను క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది.

ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇస్తున్న వడ్డీతో పోల్చి చూస్తే మాత్రం ఈ మొత్తం చాలా ఎక్కువని చెప్పవచ్చు. వడ్డీ రేటు కేంద్రం నిర్ణయాల ఆధారంగా మారుతుంది. అవసరాలకు అనుగుణంగా స్కీమ్ టెన్యూర్ ను పొడిగించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కనీసం 500 రూపాయల నుంచి గరిష్టంగా 1.5 లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు.

ఏడాదికి లక్షన్నర రూపాయలు డిపాజిట్ చేస్తే 15 సంవత్సరాల తర్వాత ఏకంగా 40 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ప్రతి నెలా 5వ తేదీలోపు డబ్బులు డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీని పొందవచ్చు. స్కీమ్ లో చేరిన వ్యక్తి మరణిస్తే అకౌంట్ ను ముందుగానే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్స్ కు ఆదాయపు పన్ను చట్టం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాపై రుణం పొందే అవకాశం ఉన్నా తక్కువ మొత్తం మాత్రమే రుణంగా లభిస్తుంది. లోన్ గా తీసుకున్న మొత్తాన్ని రెండేళ్ల లోపు చెల్లించాల్సి ఉంటుంది. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.