ప్రముఖ బ్యాంకులలో ఒకటైన కెనరా బ్యాంక్ 3000 అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. కెనరా బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ అయిన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.
2024 సంవత్సరం అక్టోబర్ నెల 4వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. canarabank.com అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్ లో నమోదు చేసుకున అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.
ఈ అప్రెంటీస్ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు సంవత్సరం పాటు శిక్షణ ఇవ్వడంతో పాటు రూ.15,000 స్టైఫండ్ పొందవచ్చు. అయితే స్టైఫండ్ మినహా అదనపు ప్రయోజనాలను పొందడం మాత్రం వీలు కాదు. కేరళ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా అక్కడ ఉద్యోగం చేయడానికి ఆసక్తి ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. అప్రెంటీస్ జాబ్స్ పై ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాలపై ఫోకస్ పెడితే మంచిది.