పీఎం కిసాన్ డబ్బులు ఖాతాలో జమయ్యాయో లేదో తెలుసుకోవాలా.. ఎలా అంటే?

1208259-pmkisan

కేంద్రంలో అధికారంలోఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండగా అర్హత ఉన్న రైతులకు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున కేంద్రం డబ్బును జమ చేస్తోంది. ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున ఈ స్కీమ్ డబ్బులు జమ కావడం జరుగుతుంది. ఈ స్కీమ్ రైతులకు ప్రయోజనం చేకూర్చనుంది.

రైతులకు పెట్టుబడి సాయం అందాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ప్రధాని మోదీ ఇప్పటికే ఈ నగదును విడుదల చేశారు. బ్యాంకుల నుంచి సంబంధిత బ్యాంక్ ఖాతాలలో ఈ నగదు జమ కావడం జరుగుతుంది. పీఎం కిసాన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం 13వ విడత డబ్బులు రైతుల ఖాతాలలో జమ కానున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊహించని స్థాయిలో లాభం చేకూరుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పీఎం కిసాన్ స్కీమ్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. అర్హత ఉండి ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందని వాళ్లు వ్యవసాయ శాఖ అధికారులను సంబంధించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. వెబ్ సైట్ ద్వారా ఖాతాలో నగదు జమయ్యాయో లేదో సులువుగా తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.