దేశానికి వెన్నెముకగా ఉన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో బతకాలను అమలులోకి తీసుకువస్తుంది. ఈ పథకాల ద్వారా రైతులను ఆర్థికంగా ఆదుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాల ద్వారా రైతులు కూడా ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం 6000 రూపాయలు ఆర్థిక సహాయం కేంద్రం అందిస్తుంది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో 2000 రూపాయలు చొప్పున నేరుగా రైతుల అకౌంట్లోకి జమ చేస్తుంది.
ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ద్వారా 11 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. రైతులకు అందించే ఈ ఆర్థిక సహాయంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా నేరుగా రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తున్నారు. ఈ స్కీమ్ లో భాగంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 2.25 లక్షల కోట్లు పంపిణీ చేసింది కేంద్రం. తాజాగా రైతుల అకౌంట్ లో డబ్బులు పడ్డాయి. మరి మీ అకౌంట్ లోనూ డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవాలా ఆయితే ఇలా చెక్ చేసేయండి.
పీఎం కిసాన్ సమ్మన్ నిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం మీ అకౌంట్ కి చేరిందో లేదో తెలుసుకోవటానికి …
• ముందుగా https://pmkisan.gov.in అనే వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాలి.
• ఆ తర్వాత మీరు ఫార్నర్ కార్నర్ మీద క్లిక్ చెయ్యండి.
• ఇక ఇప్పుడు ‘ఫార్నర్ కార్నర్ ‘లో లబ్ధిదారుల జాబితా మీద క్లిక్ చేయాలి.
• ఆ తరవాత మీరు మీ రాష్ట్రం, జిల్లా, తహసీల్, బ్లాక్, గ్రామాన్ని సంబంధించిన వివరాలునిఎంటర్ చేయాలి.
• ఆ తరువాత ‘గెట్ రిపోర్ట్’ మీద క్లిక్ చేస్తే మీకు అన్ని వివరాలతో లబ్దిదారుల జాబితా స్క్రీన్ పై కనపడతాయి.
• అందులో మీ పేరు, వివరాలు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు.
• ఇలా ఈజీగా మీరు మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు.