కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం కిసాన్ స్కీమ్ బెస్ట్ స్కీమ్ కాగా ఈ స్కీమ్ ద్వారా రైతులు ఇప్పటికే ఏడాదికి 6,000 రూపాయల చొప్పున బెనిఫిట్ పొందుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ మొత్తం మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం మూడు విడతాలలో ఈ మొత్తాన్ని ఖాతాలలో జమ చేస్తుండగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సైతం రైతుల కోసం కొన్ని స్కీమ్స్ ను అమలు చేస్తున్నాయి.
అయితే ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందుతున్న రైతులకు మేలు జరిగేలా పీఎం కిసాన్ రుణ్ పోర్టల్ పేరుతో మోదీ సర్కార్ ఒక వెబ్ సైట్ ను మొదలుపెట్టింది. ఈ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వాళ్లకు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా ఏకంగా 3,00,000 రూపాయల వరకు రుణం లభిస్తుంది. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
https://fasalrin.gov.in/ వెబ్ సైట్ ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాల కోసం దరఖాస్తు చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన సందేహాలు ఉంటే ఆ సందేహాలను సైతం నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ సహాయంతో లాగిన్ అయ్యి ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న రైతులు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.
97 కమర్షియల్ బ్యాంకులు, 58 రీజనల్ రూరల్ బ్యాంకులు, 512 కోఆపరేటీవ్ బ్యాంకులు ఈ స్కీమ్ ద్వారా రైతులకు రుణాలను అందిస్తున్నాయి. రూ.3 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ లభిస్తుండగా ఎక్కువ మొత్తం రుణం పొందితే మాత్రం వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకుని రుణం తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.