పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు ఖాతాలో జమ కాలేదా.. కచ్చితంగా పాటించాల్సిన చిట్కాలివే!

మన దేశంలో అమలవుతున్న అద్భుతమైన పథకాలలో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. మోదీ సర్కార్ 6000 రూపాయలను మూడు విడతల్లో రైతుల ఖాతాలలో జమవుతోంది. రైతు సంక్షేమమే లక్ష్యంగా ఈ స్కీమ్ అమలవుతుండటం గమనార్హం. రైతులు ఈ స్కీమ్ అమలు విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారు. ఈ ఏడాదికి సంబంధించి కొన్నిరోజుల క్రితం రైతుల ఖాతాలలో నగదు జమైంది.

అయితే కొంతమంది రైతులు మాత్రం తమ ఖాతాలలో నగదు జమ కావడం లేదని చెబుతున్నారు. 2019 సంవత్సరం నుంచి ఈ స్కీమ్ అమలవుతుండటం గమనార్హం. కొన్ని నిబంధనల ప్రకారం కొంతమంది పీఎం కిసాన్ స్కీమ్ యొక్క ప్రయోజనాలను పొందడం సాధ్యం కాదని తెలుస్తోంది. సొంత సాగుభూమి లేనివాళ్లు ఈ స్కీమ్ కు అర్హత పొందలేరు. వార్షిక ఆదాయం ఆదాయపు పన్ను శాఖ నిబంధనల కంటే ఎక్కువగా ఆదాయం ఉంటే కూడా ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందలేరు.

ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేయకుండా ఉంటారో వాళ్లు కూడా ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలను పొందలేరు. అన్ని అర్హతలు ఉన్నా ఈ స్కీమ్ నగదు జమ కాకపోతే మాత్రం వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించడం ద్వారా సులభంగా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను అయితే పొందే అవకాశాలు మాత్రం కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ద్వారా మూడు విడతల్లో రైతుల ఖాతాలలో నగదు జమవుతోంది.

2,000 రూపాయల చొప్పున పెట్టుబడి సహాయంలో భాగంగా మోదీ సర్కార్ ఈ మొత్తాన్ని అందిస్తోంది. పీఎం కిసాన్ స్కీమ్ వల్ల రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. పీఎం కిసాన్ స్కీమ్ మొత్తాన్ని పెంచితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతుండగా మోదీ సర్కార్ మనస్సులో ఏముందో తెలియాల్సి ఉంది.