ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫోన్ పే గూగుల్ పే ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఇలా ఫోన్ పే గూగుల్ పే అకౌంట్ ఉంటే క్షణాలలో మీరు వ్యక్తిగత లోన్ పొందవచ్చు.ఇలా నిమిషాలలో ఏకంగా ఐదు లక్షల రూపాయల లోన్ పొందవచ్చు అయితే ఈ లోన్ కోసం మీరు బ్యాంకులో చుట్టూ తిరగాల్సిన పనిలేదు ఇంట్లోనే ఈ లోన్ పొందవచ్చు అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం ఫోన్‌పే, గూగుల్ పే వంటివి తమ యూజర్లకు లోన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంచాయి. అయితే గూగుల్ పే (GPay) లేదా ఫోన్‌పే (PhonePe) అనేవి నేరుగా రుణాలు ఇవ్వవు.
ఫోన్ పే గూగుల్ పే నేరుగా రుణాలు ఇవ్వకుండా ఇది ఇతర సంస్థలతో అనుబంధం అయ్యి రుణ సదుపాయం అందిస్తున్నాయి. అంటే ఫోన్‌పే మనీ వ్యూ, బడ్డీ లోన్ వంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మీరు ఫోన్‌ఫే ద్వారా మనీ వ్యూ, బడ్డీ లోన్ నుంచి లోన్స్ పొందొచ్చు. ముందుగా ఫోన్‌పే యాప్‌లోకి వెళ్లాలి. అక్కడ మీకు పైన బ్యానర్‌లో మనీ వ్యూ లేదంటే బడ్డీ లోన్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో మీకు ఏది నచ్చితే దానిపై క్లిక్ చేయాలి. కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు బడ్డీ లోన్ లేదంటే మనీ వ్యూ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయ్యి మీ ఫోన్ నెంబర్,ఈమెయిల్ ఐడీ, పాన్ కార్డు నెంబర్, జాబ్ వివరాలు, రెసిడెన్షియల్ వివరాలు వంటివి నమోదు చేయాల్సి ఉంటుంది.ఈ వివరాలన్నింటినీ కనుక నమోదు చేస్తే మీరు లోన్ పొందడానికి అర్హులా కాదా అనే విషయం తెలుస్తుంది. మీరు కనుక ఎలిజిబుల్ అయితే ఏకంగా 5 లక్షల వరకు లోన్ పొందవచ్చు. అదేవిధంగా అలాగే గూగుల్ పే.. ఫ్రిఫర్ లోన్స్‌తో భాగస్వామ్యం ద్వారా కస్టమర్లకు రుణ సౌకర్యం అందిస్తోంది. మీరు రూ.10 వేల నుంచి రూ. 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు. అలాగే గూగుల్ పే.. ఫ్రిఫర్ లోన్స్‌తో భాగస్వామ్యం ద్వారా కస్టమర్లకు రుణ సౌకర్యం అందిస్తోంది. మీరు రూ.10 వేల నుంచి రూ. 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు.