గూగుల్ పే, ఫోన్ పే వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఇలా చేస్తే నష్టపోవాల్సిందే!

మనలో చాలామంది గూగుల్ పే, ఫోన్ పే యాప్స్ ను వాడతారనే సంగతి తెలిసిందే. ఈ యాప్స్ ద్వారా సులువుగా బ్యాంక్ లావాదేలు చేయడం సాధ్యమవుతుంది. అయితే ఈ యాప్స్ వాడేవాళ్లు టార్గెట్ గా ఈ మోసాలు జరుగుతున్నాయి. పొరపాటున మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బు జమ చేశామని వాటిని తిరిగి పంపాలని కోరుతూ ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.

పొరపాటున వారి అకౌంట్ కు డబ్బులు తిరిగి పంపితే మాత్రం మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. మనం అవతలి వాళ్ల అకౌంట్ కు డబ్బులు పంపితే మాత్రం తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సైబర్ నిపుణులు ఈ స్కామ్ ను మాల్వేర్ ప్లస్ హ్యూమన్ ఇంజినీరింగ్ స్కామ్ పేరుతో ఈ స్కామ్ ను పిలుస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ విధంగా కాల్ చేసిన వాళ్ల వ్యక్తిగత వివరాలు సైతం అవతలి వాళ్లకు తెలిసే ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తోంది. ఎవరైనా ఇలాంటి కాల్స్ చేస్తే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు వచ్చి డబ్బులు తీసుకోవాలని సూచిస్తే మనం ఈ తరహా మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. తరచూ యూపీఐ లావాదేవీలు చేసేవాళ్లు ఈ విషయాలకు సంబంధించి అవగాహన కలిగి ఉండాలి.

యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా వాటి గురించి తెలుసుకుని సమస్యలను పరిష్కరించుకుంటే మంచిది. యూపీఐ లావాదేవీల సంఖ్య పెరుగుతుండగా ఈ లావాదేవీల వల్ల మోసపోయే వాళ్ల సంఖ్య కూడా ఊహించని రేంజ్ లో పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.