ఈ రాశుల వారు పెళ్లంటేనే భయంతో పారిపోతారు…. అందులో మీరు కూడా ఉన్నారా?

కొంతమంది పెళ్లి మాట ఎత్తగానే ఏవో కుంటి సాకులు చెబుతూ మెల్లగా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. మరికొందరైతే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. పెళ్లి బంధం అంటే ఆసక్తి చూపకపోవడం, తమ స్వేచ్ఛకు పెళ్లి బంధం సంకెళ్లు వేస్తుంది అన్న భావన కూడా కొంతమందిలో ఉంటుంది,పెళ్లితో మరొకరితో జీవితాన్ని పంచుకోవాలన్న జీవితాంతం కలిసి నడవాలన్న కొందరికి ఇబ్బందికరంగా ఉంటుంది. కొందరైతే జీవితాంతం ఒకే వ్యక్తితో కలిసి ఉండడం అసంభవం అంటూ దాటవేస్తుంటారు. ఇలా రకరకాల కారణాలతో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే వారిని తీవ్రంగా బాధిస్తుంటుంది. ఒకవేళ పెద్దలు బలవంతంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తే ఆ పెళ్లిని చేతులారా చెడగొట్టుకోవడానికి కూడా వెనకాడరు.

ఈ గుణాలన్నీ వ్యక్తుల్లో కనిపిస్తుంటే అది వారి పొరపాటు కాదట వారి జన్మ నక్షత్రం వల్లే ఇదంతా జరుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కుంభరాశి, ధనస్సు రాశి, సింహరాశి, మకర రాశి, మిధున రాశి ఈ రాశుల వారు పెళ్లి మీద ధ్యాస కంటే కెరీర్ మీదే ఎక్కువ ధ్యాస ఉంచుతారు. వివాహ బంధం పెద్దబారంగా వీరు భావిస్తారు,వివాహ బంధంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడం కష్టంగా ఉంటుందనీ ఆ భయం ఈ రాశుల వారిని వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు చెప్పిన రాశుల వారు ఒకసారి పెళ్లి బంధంలో చిక్కుకుంటే ఇంతకుముందు ఉన్నంత ఫ్రీడమ్ ఉండదని భావించి పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుంటారు.

ఇప్పటివరకు పెళ్లి అంటే భయపడే రాశుల వారి గురించి తెలుసుకుందాం. పెళ్లి బంధం అంటే ఇష్టపడే రాశుల వారు మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మీన ఈ రాశుల వారికి పెళ్లి బంధం అంటే అపారమైన నమ్మకం. తనను నమ్మి వచ్చిన తమ భాగస్వామ్యం కోసం ఎలాంటి పరిస్థితులైన ఎదిరించి నిలబడాలనుకుంటాడు. చేసుకుంటే ఓ వ్యక్తి తమకు జీవితాంతం తోడుగా ఉంటారనే ఆలోచన వారికి చాలా ఇష్టం. పెళ్లి బంధం తర్వాత ఎలాంటి కష్టం అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఈ రాశుల వారు ఉంటారు.