ఏపీలోని కడప జిల్లాలోని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వైఎస్ఆర్ జిల్లా వైద్య సంస్థల్లో వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 208 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. రేడియోగ్రాఫర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, లైబ్రేరియన్ అసిస్టెంట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగ ఖాళీలతో పాటు క్లినికల్ సైకాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి.
కడప, పులివెందులలోని వేర్వేరు ఆస్పత్రులలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. క్లినికల్ సైకాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. మార్కులు, పని అనుభవం, రిజర్వేషన్ రూల్ ను బట్టి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ప్రిన్సిపాల్ కార్యాలయం, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, పుట్లంపల్లి, కడప, వైఎస్ఆర్ జిల్లాలో దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుంది. 2023 సంవత్సరం డిసెంబర్ 21వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభించనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.
ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే ప్రయోజనం చేకూరుతుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండటంతో వేగంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు మంచి వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.