ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. స్కేల్-1 క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 21 నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుండగా ఏప్రిల్ 12 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండనుంది.
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. 2023 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ నాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది.
https://orientalinsurance.org.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. బీకామ్ 60 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు అకౌంట్స్ ఉద్యోగాలకు అర్హులు కాగా స్టాటిస్టిక్స్/ మ్యాథమెటిక్స్/ యాక్చూరియల్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు యాక్చూరియల్ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది.
ఇంజినీరింగ్ ఉద్యోగ ఖాళీలు 15 ఉండగా ఇంజినీరింగ్ (ఐటీ) ఉద్యోగ ఖాళీలు 20, మెడికల్ ఆఫీసర్ 20 ఉద్యోగ ఖాళీలు ఉండగా లీగల్ ఉద్యోగ ఖాళీలు 20 ఉన్నాయి. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఒకింత భారీ వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.