ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఇటార్సీ కెమికల్ ప్రాసెస్ వర్కర్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 100 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. munitionsindia.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్ సైట్ నుంచి దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకుని సంబంధిత అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2023 సంవత్సరం మే నెల 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని సమాచారం అందుతోంది.
జనరల్ మేనేజర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఇటార్సీ, జిల్లా – నర్మదాపురం, మధ్యప్రదేశ్ – 461122 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 19,900 రూపాయలతో పాటు డీఏ చెల్లిస్తారు. కేటగిరీ ఆధారంగా పోస్టులు ఉంటాయి. జనరల్ కు గరిష్టంగా 40 పోస్టులు ఉండగా దివ్యాంగులకు 10 పోస్టులు మిగిలిన వాళ్లకు 50 పోస్టులు ఉన్నాయి.
నిర్దేశిత ఫార్మాట్ లో ఫారమ్ ను పూరించి ఫోటోగ్రాఫ్ లతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను జత చేయాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు వేగంగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.