Orange peel: చర్మం సౌందర్యం పోతోందా..? నారింజ తొక్కతో ఇలా చేయండి..!!

Orange peel:‘చర్మం నిగనిగలాడాలి.. మృదువుగా ఉండాలి.. అందంగా కనిపించాలి..’ ఎవరికైనా ఇదే కోరిక ఉంటుంది. ఇందులో సందేహమే లేదు. వేసవిలో చర్మం కందిపోతుంది. వర్షాకాలంలో కాస్త మృదువుగానే ఉంటుంది. చలికాలంలో పొడిబారిపోతుంది. అయితే.. ఎండలో ఎక్కువగా తిరిగితే చర్మం కందిపోయి దురద కూడా వస్తుంది. సూర్య కిరణాల వేడి తట్టుకోవడానికి మన శరీరం మెలనిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మన చర్మ సౌందర్యాన్ని తగ్గించేస్తుంది. ఎండ ఎంత పడితే అంతగా మెలనిన్ ఉత్పత్తి అయి  స్కిన్ గ్లో అంతగా పోతుంది. శరీరం మెరుపు మళ్లీ రావాలంటే నారింజ పండు చక్కని పరిష్కారం.

నారింజకాయలో మాత్రమే కాదు.. నారింజ తొక్కలో కూడా ఎన్నో సుగుణాలు ఉన్నాయి. చర్మ సౌందర్యం కాపాడే ఔషధ గని నారింజ తొక్క. నారింజ తొక్కను ఎండబెట్టి ఓ టేబుల్ స్పూన్ పొడిని తీసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, కాలమైన్ లేదా గంధపు పొడి వేయాలి. అందులో కొద్దిగా నీరు పోసి పేస్టులా కలపాలి. ఆ మిశ్రమాన్ని చర్మం కందిపోయిన ప్రదేశం, గ్లో తగ్గిపోయిన ప్రదేశంలో రాసుకోవాలి. అయిదు నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. అప్పుడు చర్మం మళ్లీ మునుపటా మెరుస్తుంది. ఇవన్నీ కాకుండా నారింజ తొక్కతో చర్మంపై మసాజ్ చేసుకున్నా కూడా చర్మం కందిపోవడం పోయి మెరుస్తుంది.

 

కేవలం నారింజ తొక్కతో చేసిన పొడి.. అయిదు నిమిషాల్లో చర్మం పూర్వపు స్థితిలోకి రావడం నిజంగా ఆశ్చర్యమే. ఎందుకంటే నారింజలో ఎక్కువగా ఉండే సిట్రిక్ యాసిడ్ ఇందుకు కారణం. ఇది సహజ సిద్ధమైన బ్లీచింగ్‌లా పనిచేయడం వల్లే ఇలా సాధ్యమవుతుంది. నారింజ రసాన్ని ఐస్ క్యూబ్‌లా చేసి దానితో చర్మంపై మసాజ్ చేసుకున్నా కూడా చర్మం మెరుస్తుంది. అందుకే స్కిన్ బ్యూటీ ప్రొడక్ట్స్ లో నారింజ తొక్కను ఉపయోగిస్తారు. నారింజ తొక్కలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. చర్మాన్ని మిరిసేలా చేయడంలో ఇది చక్కగా పనిచేస్తుంది. చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.