ప్రస్తుత కాలంలో ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఆ ప్రభావం శరీర ఆరోగ్యంపై పడుతుందనే సంగతి తెలిసిందే. నోటి దుర్వాసన సమస్య ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తోంది. ఈ సమస్య వల్ల ఇతరులు ఎంతో ఇబ్బందే పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. భోజనం చేసిన తర్వాత కొన్ని పదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
పెరుగులో ప్రో బయోటిక్స్ ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇవి నోటి దుర్వాసనను పోగొడతాయని చెప్పవచ్చు. భోజనం చివర్లో పెరుగన్నం తినడం ద్వారా నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఆహారంలో క్యాప్సికం, బ్రోకలి భాగం చేసుకుంటే క్రిములు చనిపోవడంతో పాటు నోటి దుర్వాసన వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.
విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తినడం ద్వారా కూడా నోటి దుర్వాసన సమస్య దూరమవుతుంది. కొన్ని పండ్లు తీసుకోవడం ద్వారా దంత సమస్యలు తొలగిపోవడంతో పాటు చిగుళ్లు, దంతాలు దృఢంగా మారే ఛాన్స్ ఉంటుంది. భోజనం చేసిన తర్వాత లవంగాలను నోట్లో వేసుకుని చప్పరిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు. లవంగాలలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
లవంగాలు తీసుకోవడం ద్వారా క్రిములను నాశనం చేయడంతో పాటు నోటి దుర్వాసనను తగ్గించే ఛాన్స్ అయితే ఉంటుంది. భోజనం చేసిన తర్వాత టీ స్పూన్ సోంపు తిన్నా నోటి దుర్వాసన తగ్గి నోరు ఫ్రెష్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. భోజనం చేసిన తర్వాత రెండు పుదీనా లేదా తులసి ఆకులను పచ్చిగా నమిలేయడం ద్వారా నోటి దుర్వాసన సమస్య నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది.