హాట్ హాట్ గా నోరూరించే ఆనియన్ రింగ్స్ తయారు చేసుకునే విధానం!

మొదట మూడు మీడియం సైజు ఉన్న ఆనియన్స్ ను తీసుకొని పైన పొట్టు తీసేసి మధ్యలో రింగులు రింగులు ఉండే విధంగా కట్ చేయాలి. తర్వాత ఒక ప్లేట్ లో వేసి దానిపై ఒక స్పూన్ మైదాపిండి వేసి రింగులకు బాగా పట్టే విధంగా కలపాలి. తరువాత ఒక గిన్నె తీసుకొని అందులో అరకప్పు మైదాపిండి వేసి మూడు స్పూన్ల కార్న్ ఫ్లవర్, ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, తగినంత ఉప్పు, ఒక స్పూన్ కారం, అర స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ అల్లం వేసి నీళ్లు పోస్తూ కలుపుతూ ఉండాలి.

పిండి మరి పలుచగా కాకుండా, గట్టిగా కాకుండా మామూలుగా కలుపుకోవాలి. తరువాత ఒక ప్లేట్ లో బ్రెడ్ గ్రమ్స్ తీసుకోవాలి. తరువాత రింగులను మనం కలుపుకున్న మిశ్రమంలో వేసి మొత్తం అంటుకునేలా కలిపి తర్వాత దానిని బ్రెడ్ గ్రామ్ లో వేసి ఎక్కడా గ్యాప్ లేకుండా అంతా పట్టే విధంగా కలపాలి. ఇలా అన్నీ రింగులను కలిపి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. 10 లేక 15 నిమిషాలు డీప్ ఫ్రిజ్ లో ఉంచినట్లయితే ఆయిల్ తక్కువగా పీల్చుకుంటాయి.

తర్వాత ఒక బాణి లో నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత స్టవ్ ను లో ఫ్లేమ్ లో ఉంచి ఈ రంగులను గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. అవి వేగే వరకు అలా ఇలా తిప్పుతూ ఉండాలి లేకపోతే అవి మాడిపోయే అవకాశం ఉంది. తరువాత వీటిని ఒక టిష్యూ పేపర్లో తీసుకున్నట్లయితే వాటికి ఉన్న ఆయిల్ ను ఆ టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది. ఇంకేముంది మనకు ఇష్టమైన కరకరలాడే ఆనియన్ రింగ్స్ తయారు అయిపోయినట్టే. వీటిని పిల్లలు స్నాక్స్ లాగా చాలా ఇష్టంగా తింటారు. వీటిని ఎప్పుడైనా త్వరగా చేసుకోవచ్చు.