ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్, ఫిజీషియన్, సర్జన్, హోమియోపతి డాక్టర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 262 పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ongcindia.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
చాలా రోజుల క్రితమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ నెల 23వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.
ఉద్యోగ ఖాళీలను బట్టి విద్యార్హతల విషయంలో స్వల్పంగా మార్పులు ఉంటాయని సమాచారం అందుతోంది. డాక్టర్ బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ డిగ్రీ ఉన్నవాళ్లు హోమియోపతి ఉద్యోగాలకు అర్హులు. మెరిట్ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 1 : 10 నిష్పత్తిలో ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేయనుండటం గమనార్హం.
ఓఎన్జీసీ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. రిజిస్ట్రేషన్ వెబ్ లింక్‌ను ఉపయోగించి ఈ ఉద్యోగ ఖాళీలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ వెబ్ లింక్‌ను ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.