ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. జూనియర్ కన్సల్టెంట్స్/అసోసియేట్ కన్సల్టెంట్ల ఉద్యోగ ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా ఓఎన్జీసీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
మొత్తం 12 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా డ్రిల్లింగ్ ఫీల్డ్ ఆపరేషన్స్‌లో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు కొన్ని అర్హతలకు తప్పనిసరిగా కలిగి ఉండాలి. 65 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.
రాత పరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారని సమాచారం అందుతోంది. డ్రిల్లింగ్ సర్వీసెస్, రూమ్ నెం. 40, 2వ అంతస్తు, కేడీఎమ్ భవన్, మెహసానా అసెట్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 70,000 రూపాయల వేతనం లభించనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది.
అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే నిరుద్యోగులకు ఎంతో బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. ఓఎన్జీసీ ఉద్యోగ ఖాళీల కోసం అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.