ప్రముఖ సంస్థలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ. 70,000 వేతనంతో?

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. సీనియర్ టెక్నికల్ కన్సల్టెంట్, టెక్నికల్ కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ (అకడమిక్), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్సల్టెంట్, ఇతర ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు ఏకంగా 70 వేల రూపాయల వేతనం లభించనుందని తెలుస్తోంది.

మొత్తం 65 పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా జూన్ 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. పోస్టులు, అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. అభ్యర్థులందరూ తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన సంబంధిత అర్హతలను కలిగి ఉంటే మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.

ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలగనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఒకింత పోటీ తక్కువగానే ఉండనుందని సమాచారం అందుతోంది.

అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలపై దృష్టి పెట్టి వెంటనే దరఖాస్తు చేసుకుంటే చివరి నిమిషంలో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పవచ్చు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ లో పని చేయాలనేది ఎంతోమంది కల కాగా ఆ కల సులువుగానే నెరవేరుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.