ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో భారీగా జాబ్స్.. నెలకు 70,000 రూపాయల వేతనంతో?

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2024 సంవత్సరం జనవరి 23వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు ఏకంగా 70 వేల రూపాయల వేతనం లభించనున్న నేపథ్యంలో అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వచ్చే నెలలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్షను నిర్వహిస్తారని సమాచారం అందుతోంది.

గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. uiic.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.

ఈ ఉద్యోగాలకు పోటీ ఒకింత ఎక్కువగానే ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ బెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అవుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీలలో ఉద్యోగాలు చేయాలని భావించే వాళ్లు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు.