పదో తరగతి అర్హతతో పోస్టల్ ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.63000 వేతనంతో?

ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 78 డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టుల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. indiapost.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

ఫిబ్రవరి నెల 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన హార్డ్ కాపీని పంపించడానికి చివరి తేదీగా ఉండనుంది. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు దశలలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఫేజ్ 1 లో అర్హత సాధించిన అభ్యర్థులు ఫేజ్ 2కు హాజరు కావాల్సి ఉండగా రెండు జాబితాలలో అర్హత సాధించిన వాళ్లు తుది మెరిట్ జాబితాకు అర్హులు అవుతారు.

గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా హెవీ డ్రైవింగ్ అనుభవం మరియు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మెయిల్ మోటార్ సర్వీస్ కాన్పూర్, gpo కాంపౌండ్, కాన్పూర్- 208001, ఉత్తరప్రదేశ్ చిరునామాకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 63 వేల రూపాయల వరకు వేతనం లభించనుండగా అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు పరోక్షంగా ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.