సిఆర్‌పీఎఫ్ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. రాతపరీక్ష లేకుండానే భారీ వేతనంతో?

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. సీఆర్పీఎఫ్ హాస్పిటల్స్ లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పురుష మరియు మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంబీబీఎస్ డిగ్రీతో పాటు ఇంటర్న్‌షిప్ అనుభవం కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. డిసెంబర్ నెల 4వ తేదీన వేర్వేరు సీఆర్పీఎఫ్ కేంద్రాలలో ఈ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. జగదల్పూర్, గౌహతి, శ్రీనగర్, నాగ్‌పూర్, భువనేశ్వర్ లో ఉన్న కాంపోజిట్ హాస్పిటల్, గ్రూప్ సెంటర్ లలో ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.

కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 75,000 రూపాయల వేతనం లభిస్తుంది. ఒరిజినల్ మరియు ఫోటోకాపీలతో ఈ ఉద్యోగ ఖాళీలకు హాజరు కావాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఇంటర్వ్యూ ఆనంతరం వైద్య పరీక్షలను నిర్వహిస్తారు.

ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుండగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. భారీ వేతనం లభిస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.