నిరుద్యోగ యువతీ యువకులకు రైల్వే శాఖ అదిరిపోయే తీపికబురు అందించింది. సెంట్రల్ రైల్వే జోన్ అప్రెంటిస్‌షిష్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ను తాజాగా రిలీజ్ చేయగా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది. rrccr.com వెబ్ సైట్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఆగష్టు 15వ తేదీ దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉందని తెలుస్తోంది.
అప్రెంటీస్ గా జాయిన్ అయిన వాళ్లు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 2,424 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుండటంతో నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలగనుంది. కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులైన వాళ్లు ఈ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
సంబంధిత ట్రేడ్ లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ పొందిన వాళ్లు మాత్రమే ఈ అప్రెంటీస్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 15 ఏళ్ల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ అప్రెంటీస్ షిప్ కు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులు ఉండనున్నాయి.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపులు ఉన్న నేపథ్యంలో నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుందని చెప్పవచ్చు. అప్రెంటీస్ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ జాబ్ నోటిఫికేషన్ పై దృష్టి పెట్టి దరఖాస్తు చేస్తే సులువుగా జాబ్ కు ఎంపికయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.