నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. రాతపరీక్ష లేకుండానే ఉద్యోగ ఖాళీలు!

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 345 మెడికల్ ఆఫీసర్ పోస్టులను ఐటీపీబీ భర్తీ చేస్తుండగా సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (సెకండ్ ఇన్ కమాండ్) ఉద్యోగ ఖాళీలతో పాటు స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ (డిప్యూటీ కమాండెంట్), మెడికల్ ఆఫీసర్స్ (అసిస్టెంట్ కమాండెంట్) ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

recruitment.itbpolice.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్ 14వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఎంబీబీఎస్ డిగ్రీతో పాటు మెడిసిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు.

స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లకు సైతం ఎంబీబీఎస్ డిగ్రీతో పాటు ఏడాదిన్నర అనుభవం ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 400 రూపాయలుగా ఉండగా ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మేన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఆన్ లైన్ మోడ్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది.

డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. అన్ని దశలను క్లియర్ చేసిన వాళ్లు మాత్రమే మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.