ఎంబీబీఎస్ లేదా ఎండీ లాంటి వైద్య విద్య కోర్సులను పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ కొలువులను సాధించాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా తాజాగా 354 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. 50 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు సూపర్ స్పెషాలిటీ మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు అర్హులు కాగా 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి అర్హత కలిగి ఉంటారు.
మెడికల్స్ ఆఫీసర్స్ ఉద్యోగ ఖాళీలకు 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయో పరిమితిలో సడలింపులు ఉండగా ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకు మూడు సంవత్సరాల చొప్పున సడలింపులు ఉంటాయి. పర్సనల్ ఇంటర్వ్యూ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది.
200 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు లక్షన్నర రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా మార్కుల కేటాయింపు ఉంటుంది. పురుష అభ్యర్థుల హైట్, ఛాతీ కొలతల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ జాబ్స్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి.
https://www.itbpolice.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 2024 సంవత్సరం నవంబర్14వ తేదీ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.