ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. భారీ వేతనంతో 189 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రయోజనం చేకూరేలా జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మెడికల్ ఆఫీసర్స్, స్టాఫ్ నర్స్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. apmsrb.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

మార్చి నెల 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. మెడికల్ ఆఫీసర్ పోస్టులు 102, స్టాఫ్ నర్స్ ఖాళీలు 87 ఉండగా కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది.

రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని తెలుస్తోంది. మెడికల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎంబీబీఎస్ పూర్తిచేసిన వాళ్లు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్లు స్టాఫ్ నర్స్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

apmsrb.ap.gov.in వెబ్ సైట్ లో మెడికల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ నర్స్ రిక్రూట్‌మెంట్‌ లింక్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడం జరిగింది. కేటగిరీల ఆధారంగా దరఖాస్తు ఫీజులో మార్పులు ఉంటాయని గుర్తుంచుకోవాలి. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.