ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీ అమలు దిశగా అడుగులు అడుగులు పడుతున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ.10 లక్షల వరకు అందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. డ్వాక్రా మహిళలను సంపాదనపరులుగా, లక్షాధికారులుగా తీర్చిదిద్దుతామని భరోసా ఇవ్వడం గమనార్హం.
తన దగ్గర స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తానని చంద్రబాబు వెల్లడించడం గమనార్హం. రాబోయే రోజుల్లో వడ్డీ లేని రుణాలు రూ.10 లక్షల వరకు డ్వాక్రా మహిళలకు అందితే డ్వాక్రా మహిళలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు తల్లికి వందనం స్కీమ్ అమలు విషయంలో మాట నిలబెట్టుకుంటామని చంద్రబాబు సర్కార్ చెబుతోంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ స్కీమ్ అమలు చేస్తామని చంద్రబాబు సర్కార్ పేర్కొంది. ఈ వార్త ఏపీ మహిళలకు అదిరిపోయే శుభవార్త అనే చెప్పాలి. తల్లికి వందనం స్కీమ్ వల్ల మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
చంద్రబాబు నాయుడు తల్లికి వందనం స్కీమ్ అమలు విషయంలో జాగ్రత్తగా, తెలివిగా అడుగులు వేశారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అందితే వాళ్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది.