చిన్నపిల్లలకు ఆయిల్ మసాజ్ చేసేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఈ విషయాలు తెలుసా?

పిల్లల సంరక్షణకు సంబంధించి మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఆ ప్రభావం పిల్లల కెరీర్ పై పడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు. పిల్లలకు స్నానం చేయించే సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు. చిన్న పిల్లలకు ఒళ్లంతా నూనెతో మసాజ్ చేసి ఆ తరువాత స్నానం చేయించడం ఎక్కువగా జరుగుతుంది.

కొబ్బరినూనె, ఆలివ్ నూనె, బాదం నూనె లేదా ఆవాల నూనె సహాయంతో ఎక్కువమంది పిల్లలకు స్నానం చేయిస్తూ ఉంటారు. పిల్లలకు మసాజ్ చేయడం కండరాలను ఒత్తిడికి గురి చేసే ప్రక్రియ కాగా ఈ విధంగా చేయడం వల్ల ఎముకలు, కీళ్లు మొదలైన వాటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. పిల్లలకు మసాజ్ చేయడం వల్ల కండరాలు, ఎముకలు బలపడి పిల్లలు బలంగా ఉంటారు.

మసాజ్ చేస్తే చేతులు, కాళ్లలో పట్టు పెరగడంతో పాటు కాళ్లు చేతులలోనే కాకుండా శరీరం అంతా రక్తప్రసరణ మెరుగ్గా ఉండే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మసాజ్ చేసిన తరువాత పిల్లలకు స్నానం చేయిస్తే హాయిగా నిద్ర పోయే అవకాశాలు ఉంటాయి. గ్యాస్, ఉబ్బరం, కండరాల తిమ్మిరి, మలబద్దకం వంటి సమస్యలు పిల్లలలోనూ వచ్చే ఛాన్స్ ఉండగా పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

పిల్లలకు సున్నితంగా మసాజ్ చేస్తే మాత్రమే ఈ బెనిఫిట్స్ పిల్లలు పొందే అవకాశాలు ఉంటాయి. మరీ కఠినంగా చేస్తే మాత్రం పిల్లల్ని కొత్త సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. పిల్లలకు బలవంతంగా మసాజ్ చేయడం మంచిది కాదు. కృత్రిమ నూనెలను ఎప్పుడూ పిల్లల మసాజ్ కోసం వినియోగించకూడదు. పిల్లలకు స్నానం చేయించే నీరు మరీ వేడిగా ఉండకూడదు.