నవోదయ విద్యాలయ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 1377 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. త్వరలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుండగా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. navodaya.gov.in అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ త్వరలో మొదలుకానుండగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. మహిళా స్టాఫ్ నర్స్ ఉద్యోగ ఖాళీలు 121 ఉండగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జాబ్స్ 5, ఆడిట్ అసిస్టెంట్ జాబ్స్ 12, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ జాబ్స్ 4, లీగల్ అసిస్టెంట్ జాబ్ 1, స్టెనోగ్రాఫర్ జాబ్స్ 23, కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ 2, క్యాటరింగ్ సూపర్‌వైజర్ జాబ్స్ 78 ఉన్నాయి.
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 381 ఉండగా ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ ఉద్యోగ ఖాళీలు 128 ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగ ఖాళీలు 161 ఉండగా మెస్ హెల్పర్ ఉద్యోగ ఖాళీలు 442, ఎంటీఎస్ ఉద్యోగ ఖాళీలు 19 ఉన్నాయి. అర్హతలు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. పోటీ పరీక్ష, ఇంటర్వ్యూ రౌండ్, ట్రేడ్/స్కిల్ టెస్ట్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తు రుసుము 1500 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉండనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఎక్కువ బెనిఫిట్స్ పొందవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.