డిగ్రీ అర్హతతో 40,000 వేతనంతో భారీగా ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 50 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా ఎన్టీపీసీ అడుగులు వేస్తోంది. ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా ఈ నెల 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. బీఎస్సీ డిగ్రీ (అగ్రికల్చరల్ సైన్స్‌) పాస్ కావడంతో పాటు పని అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. https://ntpc.co.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపులు ఉండగా పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఏకంగా పది సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. ఈ ఉద్యోగాలకు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 300 రూపాయలుగా ఉండనుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 40,000 రూపాయలు వేతనం లభించే అవకాశం ఉండగా అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలపై వెంటనే దృష్టి పెడితే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.