నిరుద్యోగులకు ఎన్‌టీపీసీ అదిరిపోయే శుభవార్త.. భారీ వేతనంతో 495 ఉద్యోగ ఖాళీలు!

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. గేట్ అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. careers.ntpc.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 495 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి.

ఈ ఉద్యోగ ఖాళీలలో మెకానికల్ ఉద్యోగ ఖాళీలు 200 ఉండగా ఎలక్ట్రికల్ ఉద్యోగ ఖాళీలు 120 ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఉద్యోగ ఖాళీలు 80 ఉండగా మైనింగ్ ఉద్యోగ ఖాళీలు 65, సివిల్ ఉద్యోగ ఖాళీలు 30 ఉన్నాయి. 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా అర్హత ఉన్నవాళ్లకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

www.ntpc.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్-2023 రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికయ్యే అభ్యర్థులకు ఎన్‌టీపీసీ సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుంది. రూ.5,00,000 విలువ చేసే సర్వీస్ అగ్రిమెంట్ బాండ్‌పై జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు సంతకం చేయాల్సి ఉండగా మిగతా అభ్యర్థులు రూ.2,50,000 విలువ చేసే బాండ్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు ట్రైనింగ్ అనంతరం మూడేళ్ల పాటు ఎన్‌టీపీసీలో తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.