ఈ మధ్య కాలంలో టర్మ్ ఇన్సూరెన్స్ గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకాల మరణం చెందితే టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల ఆర్థిక కష్టాలు దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్యామిలీ సేఫ్టీ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని భావించే వాళ్లు కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. కొన్ని విషయాలను తెలుసుకోకపోతే ఫ్యూచర్ లో క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
తక్కువ వయస్సులో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. 40 ఏళ్ల వయస్సులో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియం సైతం భారీ స్థాయిలో ఉంటుందని చెప్పవచ్చు. పాలసీ తీసుకునే సమయంలో సరైన వివరాలను ఇవ్వాలి. అలవాట్లు, ప్రీ డిసీజెస్ గురించి ముందుగానే సమాచారం ఇవ్వాలి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్లు నెలవారీ పే అవుట్ ఆప్షన్ ఎంచుకోవడం ఉత్తమం అని చెప్పవచ్చు.
ఈ ఆప్షన్ వల్ల డబ్బు వృథా అయ్యే అవకాశం ఉండదు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే అతని పేరుపై ఏదైనా లోన్లు ఉన్నా టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ మొత్తం నుంచి ఆ డబ్బును మినహాయిస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్లు క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ ఆప్షన్ యాడ్ చేసుకుంటే అనారోగ్యానికి గురైన సమయంలో 25 లక్షలు పొందవచ్చు.
తీవ్రమైన అనారోగ్యానికి గురై ప్రీమియం కట్టలేని స్థితిలో ప్రీమియం తీసుకున్న వ్యక్తి ఉంటే ప్రీమియంలు అన్నీ మాఫీ అవుతాయని చెప్పవచ్చు. 20 ఏళ్ల తరువాత ఈ కోటి రూపాయల విలువ జస్ట్ రూ. 40 లక్షలు కాబట్టి టాప్ అప్ ఆప్షన్ ను ఎంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.