అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. భారీ వేతనంతో?

Job-Vacancy

ఇండియన్ రైల్వే నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. నార్త్ వెస్టర్న్ రైల్వే అసిస్టెంట్ లోకో పైలెట్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 238 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. జనరల్ డిపార్ట్ మెంట్ కాంపిటీషన్ ఎగ్జామినేషన్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

 

మరో ఐదు రోజుల్లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా మే నెల 6వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రేడ్ లో ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

 

మెడికల్ టెస్ట్ లతో పాటు రాత పరీక్ష, సర్టిఫికేట్ల పరీశీలన, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఏ1 మెడికల్ స్టాండర్డ్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా ఎలాంటి దరఖాస్తు ఫీజు లేకుండానే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. http://www.rrcjaipur.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

గ్రేడ్ 2 పే లెవెల్ ను బట్టి వేతనం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలలో జనరల్ కేటగిరీ కింద 120 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుండగా మిగిలిన కేటగిరీల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలుగుతుంది.