ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 89 ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఐఐటీ హైదరాబాద్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 12వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
ఈ ఉద్యోగ ఖాళీలలో జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలు 29 ఉండగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 17 ఉన్నాయి. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ ఉద్యోగ ఖాళీలు 10 ఉండగా అకౌంటెంట్ ఉద్యోగ ఖాళీలు 9 ఉన్నాయి. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 6 ఉండగా టెక్నికల్ సూపరింటెండెంట్ ఉద్యోగ ఖాళీలు 4 ఉన్నాయి. సెక్షన్ ఆఫీసర్ జాబ్స్ 2 ఉండగా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 2 ఉండటం గమనార్హం.
జూనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ జాబ్స్ 2 ఉండగా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ 1, జూనియర్ సైకలాజికల్ కౌన్సెలర్ (మేల్) 1, జూనియర్ హార్టికల్చరిస్ట్ 1, జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) 1, జూనియర్ ఇంజినీర్ (సివిల్) 1, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 1, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ 1, ఫిజియోథెరపిస్ట్ (మేల్) 1 ఉన్నాయి. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవాళ్లు ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ల ప్రకారం వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. iith.ac.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.