ఏపీ నిట్ లో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 24 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మెకానికల్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్‌ మేనేజ్‌మెంట్, సైన్సెస్ తో పాటు మెటలర్జికల్ అండ్‌ మెటీరియల్స్ ఇంజినీరింగ్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్,బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాలలో కూడా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ పాస్ కావడంతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. మిగతా అభ్యర్థులు మాత్రం 1000 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉన్న భారతీయులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే 5000 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

అకడమిక్ మెరిట్‌, పని అనుభవం, ఇంటర్వ్యూ, ప్రెజెంటేషన్‌ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. నవంబర్ 13వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. దరఖాస్తు హార్డ్‌కాపీ సమర్పణకు నవంబర్ నెల 20వ తేదీ చివరి తేదీగా ఉంది. దరఖాస్తు హార్డ్ కాపీని నిట్ తాడేపల్లిగూడెం అడ్రస్ కు పంపాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా బెనిఫిట్ కలగనుంది.