నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 89 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే బెనిఫిట్ కలుగుతుంది. nhpcindia.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
గేట్-2022 స్కోర్‌కార్డ్ ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ట్రైనీ ఇంజనీర్ సివిల్ ఉద్యోగ ఖాళీల కోసం గరిష్ట వయో పరిమితి 30 సంవత్సరాలు కాగా ట్రైనీ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఉద్యోగ ఖాళీల కొరకు గరిష్ట వయో పరిమితి 30 ఏళ్లుగా ఉంది. ట్రైనీ ఇంజనీర్ మెకానికల్, ట్రైనీ ఆఫీసర్ ఫైనాన్స్ ఉద్యోగాల కోసం కూడా 30 ఏళ్లు గరిష్ట వయో పరిమితిగా ఉంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా లక్షా 60 వేల రూపాయల వరకు వేతనం లభించే అవకాశం ఉన్న నేపథ్యంలో అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ జాబ్ నోటిఫికేషన్ పై దృష్టి పెడితే మంచిది.
నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగ ఖాళీల కోసం పోటీ ఒకింత ఎక్కువగానే ఉండే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. కేవలం 89 పోస్టులు మాత్రమే ఉన్న నేపథ్యంలో అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.