నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు మరో తీపికబురును అందించింది. జాతీయ రహదారుల నిర్మాణం, మెయింంటెనెన్స్ చేపట్టే ఈ సంస్థ అడ్వైజర్ ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. nhai.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉండగా కాంట్రాక్ట్ బేసిస్ ప్రకారం ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుండటం హాట్ టాపిక్ అవుతోంది.
2024 సంవత్సరం జనవరి 4వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మొత్తం 18 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలలో ఒకటి అడ్వైజరీ జాబ్ కాగా మిగతా ఉద్యోగాలు జూనియర్ అడ్వైజరీ పోస్టులు కావడం గమనార్హం. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైన్స్ గ్రూప్‌లో కనీసం డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు అడ్వైజరీ జాబ్ కు అర్హులు.
ఫారెస్ట్, హార్డికల్చర్ రంగాలలో అనుభవం ఉన్నవాళ్లు సైతం ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కనీసం 20 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సైన్స్ గ్రూప్‌లో కనీసం డిగ్రీ పూర్తిచేసన వాళ్లు జూనియర్ అడ్వైజర్ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 15 ఏళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు.
65 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 1,25,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.