రూ.5,000తో రూ.26.23 లక్షలు సులువుగా పొందే అవకాశం.. ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే?

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ గురించి మనలో చాలామంది వినే ఉంటారు. దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టాలని భావించే వాళ్లకు ఉన్న బెస్ట్ స్కీమ్స్ లో ఈ స్కీమ్ కూడా ఒకటి కావడం గమనార్హం. కనీసం 1000 రూపాయల నుంచి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉండగా 15 ఏళ్లు, 20 ఏళ్లు ఈ స్కీమ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో ఊహించని లాభాలు సొంతమవుతాయని చెప్పవచ్చు.

ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.1 శాతం వడ్డీ లభిస్తుండగా దీర్ఘకాలంలో మంచి లాభాలు లభిస్తాయి. నెలకు 1000 రూపాయల చొప్పున 15 ఏళ్ల పాటు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 3.25 లక్షల రూపాయలు పొందే ఛాన్స్ ఉండగా 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే 5.32 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. నెలకు రూ.5000 చొప్పున 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా రూ.26.23 లక్షలు సొంతమవుతాయని చెప్పవచ్చు.

మన సేవింగ్స్ ను బట్టి ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ఎలాంటి పన్ను ఉండదు కాబట్టి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసినా సమస్య లేదు. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో మంచి లాభాలు సొంతం చేసుకోవాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది.

ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 500 రూపాయల నుంచి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు లోన్ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లలో, ప్రభుత్వ బ్యాంక్ లలో కూడా పీపీఎఫ్ అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ స్కీమ్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.