మన భారతీయ సంస్కృతిలో పండుగలకు చాలా విశిష్టత ఉంది. ఒక్కో ప్రాంతానికి చెందిన ప్రజలు వారి ఆచారాల ప్రకారం పండుగలను ఎంతో ఆనందంగా ఘనంగా జరుపుకుంటారు. అలాగే హోలీ పండుగను కూడా దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చెడు మీద మంచి విజయం సాధించిన సందర్భంగా ఈ హోలీ పండుగ రోజున రంగులు పూసుకుంటూ ప్రజలందరూ ఉల్లాసంగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ హోలీ పండుగ జరుపుకునే నూతన వధూవరులు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. హోలీ పండుగ రోజున నూతన దంపతులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వివాహం తర్వాత మొదటిసారిగా హోలీ పండుగ జరుపుకునే నూతన దంపతులు ఈ పండుగను పొరపాటున కూడా అత్తమామల ఇంట్లో జరుపుకోకూడదు. ఇలా జరుపుకోవటం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని పెద్దలు చెబుతున్నారు. అందువల్ల వివాహం తర్వాత వచ్చే మొదటి హోలీ పండుగను వధువు పుట్టిన ఇంట్లో జరుపుకోవాలి. అలాగే హోలీ ఆడడానికి ఒకరోజు ముందు హోలిక దహన్ నిర్వహిస్తారు. ఈసారి మార్చి 7 వ తేదీన హోలిక దాహన్ ఉంటుంది.. అయితే నూతన వధూవరులు ఈరోజున హోలిక దహన్ చూడకూడదు అని పెద్దలు చెబుతున్నారు. అలాగే నూతన వధూవరులు హోలీ రోజున నల్లటి దుస్తులను ధరించకూడదు. ఎందుకంటే నల్లటి దుస్తులు ధరించటం ఆశుభానికి సంకేతంగా భావిస్తారు. అంతే కాకుండా నలుపు రంగు అనేది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుందని పూర్వీకులు చెబుతున్నారు.
అంతేకాకుండా పెళ్లి అయిన తర్వాత తొలిసారి హోలీ జరుపుకునే మహిళలు తెల్లని దుస్తులు అస్సలు ధరించకూడదు. తెల్లటి దుస్తులకు బదులుగా పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులను ధరించవచ్చు. ఇలా కొత్తగా పెళ్లయిన మహిళలు తెల్లటి దుస్తులు ధరించడం కూడా అశుభంగా భావిస్తారు. అలాగే హోలీ పండుగ రోజున ఇంటికి వచ్చిన అతిథులకు కానుకలు ఇస్తూ ఉంటారు. అయితే వివాహ సమయంలో వధూవరులకు వచ్చిన కా కానుకలను హోలీ పండుగ రోజు ఇంటికి వచ్చిన అతిధులకు ఇవ్వటం కూడా మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు.