సాధారణంగా పెళ్లికి ఎంత ఖచ్చితమైన ముహూర్తాన్ని నిర్ణయిస్తారు పెళ్లి తర్వాత జరిగేది గర్భధారణకు కూడా అలాగే సరైన ముహూర్తాన్ని నిర్ణయించి పెద్దలు వధూవరులకు మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తారు.ఈ విధంగా చాలామంది నూతన వధూవరులు మొదటి రాత్రి విషయంలో చాలా కంగారుగా ఆందోళనగా ఎన్నో అపోహలను కలిగి ఉంటారు. ఈ అపోహల వల్ల చాలామంది నిరుత్సాహాన్ని కూడా కలిగే ఉంటారు. అయితే మొదటి రాత్రి రోజు వధూవరులలో ఎలాంటి అపోహలు ఉంటాయి నిపుణులు ఏమంటున్నారు అనే విషయానికి వస్తే….
చాలామంది తమ జీవిత భాగస్వామితో లైంగికంగా కలవడం వల్ల లైంగిక సమస్యలు తలెత్తుతాయని భావిస్తూ ఉంటారు. ఇలా లైంగికంగా తమ జీవిత భాగస్వామితో కలిసే సమయంలో ఎలాంటి లైంగిక సమస్యలు రాకుండా ఉండాలని చాలామంది మొదటి రాత్రిన వారి సంరక్షణ కోసం కండోమ్ ఉపయోగించాలని అపోహ పడుతూ ఉంటారు. ఈ కండోమ్స్ వాడటం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని నిపుణులు చెబుతున్నారు.
తొలి రాత్రి విషయంలో వధూవరులు అందుకు పూర్తిగా సిద్ధంగా ఉండరు కనుక కాస్త ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలలో రక్తస్రావం జరుగుతుందేమోనని ఆందోళన చెందుతుంటారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని తొలి కలయిక వల్ల ఏ విధమైనటువంటి రక్తస్రావం జరగదని నిపుణులు చెబుతున్నారు. ఇక మొదటి రోజు రాత్రి కలయికలు ఎవరూ కూడా సంతృప్తి పొందలేరు. దాంతో అబ్బాయిలు తాము లైంగిక జీవితానికి పనికి రామేమో అనే అపోహలో ఉంటారు అయితే ఇది పూర్తిగా తప్పని నిపుణులు చెబుతున్నారు.అయితే తొలి రోజు రాత్రి గదిలోకి వెళ్లిన వెంటనే ఒకేసారి కలయికలో పాల్గొనకుండా మీ జీవిత భాగస్వామితో మాట్లాడుతూ ముందుగా మీలో ఉన్నటువంటి ఆందోళనను తగ్గించుకోవాలని అప్పుడే ఎలాంటి అపోహలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.