ప్రజలను ఆర్ధికంగా ఆదుకోవటానికి కేంద్రం ఇప్పటికే ఎన్నో పథకాలను అమలులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్ పేరుతో ఒక పథకం ప్రవేశ పెట్టింది. ఈ స్కీం ద్వారా సీనియర్ సిటిజన్స్ పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న సమయంలో ఈ స్కీం లో పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ తర్వాత మనం పెట్టిన పెట్టుబడికి అధిక ఆదాయంతో పెన్షన్ పొందవచ్చు. అలానే ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు. కేంద్రంప్రవేశపెట్టిన ఈ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ స్కీమ్ నిబంధనలలో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ స్కీమ్ నుండి నగదు విత్ డ్రా చేసుకోవడానికి కొత్త రూల్ ని తీసుకు రానున్నారు. ఈ కొత్త రూల్స్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వెల్లడించింది. అలాగే డబ్బు విత్ డ్రా చేసుకొని సమయంలో కొన్ని పత్రాలను కూడా తప్పనిసరిగా అప్ డేట్ చేయాలని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వెల్లడించింది. ఒకవేళ వీటిని అప్ లోడ్ చేయక పోతే ఎన్‌పీఎస్ నుంచి నగదు ఉపసంహరించుకోలేరు.
సీనియర్ సిటిజెన్లు ఉద్యోగ సమయంలో ఎన్‌పీఎస్ స్కీమ్ లో పెట్టిన పెట్టుబడి మొత్తం తో పాటు దానికి చెందిన వడ్డీ కూడా లభిస్తుంది అయితే ఉద్యోగ విరమణ తర్వాత ప్రతీ నెల పింఛన్ రూపంలో వారి డబ్బు పొందవచ్చు. అయితే ప్రతినెల డబ్బు డ్రా చేయటానికి చందాదారులకు కేవైసీ పత్రాలు తప్పక సబ్మిట్ చెయ్యాలి. అలానే అప్ లోడ్ చెయ్యాల్సి వుంది. అలాగే నగదు విత్ డ్రా చేసుకునే ముందు మీరు ఎన్‌పీఎస్ ఉపసంహరణ ఫారమ్‌ను నిర్ధారించుకోవాల్సి వుంది.