నెల్లూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. నెల్లూరు జిల్లాలో ఉద్యోగం కావాలని భావించే వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మొత్తం12 ఉద్యోగ ఖాళీలు ఉండగా బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టులు 10, జిల్లా కోఆర్డినేటర్ పోస్టులు 1, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్ లు 1 ఉన్నాయి.
డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, దర్గామిట్ట, నెల్లూరు, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా చిరునామాకు ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.
ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2023 సంవత్సరం డిసెంబర్ 23వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు వేతనం కూడా ఒకింత భారీ స్థాయిలోనే ఉండనుందని తెలుస్తోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుందని సమాచారం అందుతోంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాలపై దృష్టి పెడితే మంచిది.