పదో తరగతి లేదా ఐటీఐ అర్హతతో ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.47 వేల వేతనంతో?

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 150 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లోని వేర్వేరు ప్రాంతాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. పదో తరగతి, సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈరోజు నుంచి ఈ ఉద్యోగ ఖాళీల కోసం 3ఫిబ్రవరి నెల 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అసిస్టెంట్ ఫోర్‌మెన్ గ్రేడ్ సి ఉద్యోగ ఖాళీలు 9 ఉండగా అసిస్టెంట్ ఫోర్‌మెన్ (మెకానికల్) (ట్రైనీ) గ్రేడ్-సి మైన్స్ ఉద్యోగ ఖాళీలు 59, అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్) (ట్రైనీ) గ్రేడ్-సి మైన్స్ ఉద్యోగ ఖాళీలు 48 ఉన్నాయి.

ఎలక్ట్రికల్ & మెకానికల్ ఉద్యోగ ఖాళీల విషయానికి వస్తే 34 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా అర్హత కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో ఉద్యోగానికి ఒక్కో విద్యార్హత ఉండగా అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. 30 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 47330 రూపాయల వేతనం లభించనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు ఇతర ఆలవెన్స్ లు లభిస్తాయి. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.