నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. పది అర్హతతో 338 కేంద్ర ప్రభుత్వ ఖాళీలు?

నేషనల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 338 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలు కాగా ఆగష్టు నెల 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 1180 రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఈ.ఎన్.ఎం అభ్యర్థులతో పాటు డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉండటం వల్ల నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుంది.

https://www.nclcil.in/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ లింక్ లో రిక్రూట్మెంట్ ఆప్షన్ ను ఎంపిక చేసుకుని దరఖాస్తు ఫామ్ ను నింపాల్సి ఉంటుంది. భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వరుసగా భారీ జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఎక్కువ మొత్తం వేతనం లభిస్తుండటంతో నిరుద్యోగులకు మరింత బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. అర్హత, అసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.